బీసీలకు అన్యాయం చేస్తున్న అగ్రవర్ణాలు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీసీలకు అన్యాయం చేస్తున్న అగ్రవర్ణాలు..!
– హైకోర్టు స్టే ఇవ్వడంలో అన్నీ పార్టీ రాజకీయీలు
– బీసీలను స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు
– బీజేపీ, బీఆర్ఎస్‌ల చిత్తశుద్ది.. తేటతెల్లం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్
– తాండూరులో బీసీ సంఘం నాయకుల దర్నా, నిరసన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అగ్రవర్ణాలు అన్యాయం చేస్తున్నాయని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ ద్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు విధించిన స్టే ఆర్డర్‌కు వ్యతిరేకంగా శుక్రవారం బీసీ సంఘాల ఆధ్వర్యంలో తాండూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద భారీ నిరసన ధర్నా చేపట్టారు.

ఈ సంరద్భంగా బీసీ సంఘం నాయకులు నినాదాలతో తాండూర్ దద్దరిల్లించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడం, హైకోర్టు ద్వారా స్టే ఇవ్వించడం అగ్రవర్ణాల కుట్రలో భాగమని తీవ్రంగా విమర్శించారు. రాజ్యాధికారాలు అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నంతకాలం బహుజనులు బానిసలుగానే ఉంటారని అన్నారు. ఎమ్మెల్యే నుండి సీఎం వరకు ఎక్కువ శాతం అగ్రకులాలే పదవులు అనుభవిస్తుంటే కేవలం స్థానిక సంస్థల ఎన్నికలకు 42 శాతం రిజర్వేషన్లు బీసీలకు కేటాయిస్తే ఓర్వలేక కోర్టులను ఆశ్రయించారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను కేవలం స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సమస్యలపై నిజమైన నిబద్ధత ఉంటే, బిజెపి మరియు బిఆర్ఎస్ పార్టీలు కోర్టులో ఇంప్లేడ్ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు బిజెపి పార్టీ 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు అమలు అయితే ముస్లింలు లబ్ధి పొందుతారని సాకుతో అడ్డుకుంటున్నారని గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం 34 ఉన్న బీసీల రిజర్వేషన్లను 23 శాతానికి తగ్గడానికి కారణమైందని ఆరోపించారు. అలాగే కోర్టులో పిటిషన్ వేయకుండా మాధవరెడ్డిని అడ్డుకునే శక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి లేదా?అని ప్రశ్నిస్తూ, ప్రభుత్వం బీసీల హక్కుల విషయంలో నిష్క్రియగా వ్యవహరిస్తోందని ఆరోపించారు బీసీ హక్కుల కోసం, రిజర్వేషన్ల రక్షణ కోసం, ప్రభుత్వం తక్షణమే సుప్రీంకోర్టులో విరోధ పిటిషన్ SLP వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
kvcs

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ కార్యదర్శి సయ్యద్ సుకుర్, జిల్లా బీసీ నాయకులు గడ్డం వెంకటేష్, మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత, ఉపాధ్యక్షురాలు మంజుల, కార్యదర్శి విజయలక్ష్మి, జగదీశ్వరి, పెద్దముల్ మండల అధ్యక్షురాలు శివ లీల, బీసీ సంఘం సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్, బీసీ సంఘం బషీరాబాద్ మండల అధ్యక్షులు నరేందర్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణ, నాయి బ్రాహ్మణ సమాజ అధ్యక్షులు పరమేష్, మువదిరాజ్ సంఘం కార్యదర్శి రాము, బిసి యువ నాయకులు పరమేష్, మంతటి రాజు, బాబు మల్కాపూర్, యాసర్, టైలర్ రమేష్, జావీద్ జుంటుపల్లి వెంకట్, శివ, అరుణ్ రాజ్ సురేష్, అంజద్ అలీ భాష , సిబి వినోద్, నందు,పాండు ముదిరాజ్ ధర్నాలో బీసీ సంఘాల ప్రతినిధులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

జేబీ హాస్పిటల్‌లో న్యూరో క్యాంపు..!