రైల్వే మినిష్టర్ అవుతా..!

తాండూరు తెలంగాణ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

రైల్వే మినిష్టర్ అవుతా..!
– జూబ్లీ ఉపపోరులో పోరాడుతాం
– ఆయన రాజకీయాలకు సూటు కారు
– వికారాబాద్ జిల్లా అధ్యక్షుడిపై ఆసక్తికర వాఖ్యలు
– తాండూరులో మీడియాతో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : రానున్న రోజుల్లో నేనే రైల్వే మినిస్టర్ అవుతానని చేవేళ్ల పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంపీగా తాను మర్పల్లిలో ఇంటర్ సిటీ రైలు ఆపేలా కృషి చేశానని.. బషీరాబాద్ లో రాయలసీమ ఎక్స్ ప్రెస్ ఆపేలా రైల్వే బోర్డును కోరడం జరిగిందని చెప్పుకొచ్చారు.

కొద్ది వారాల్లోనే హుబ్లీ ఎక్స్ ప్రెస్ కూడా ఆపేలా కృషి చేస్తామని అన్నారు. గతంలో కాంగ్రెస్ హాయంలో ఉన్న రైల్వే శాఖ మంత్రి ఇక్కడి రైల్వే సమస్యలపై చొరవ చూపలేదని అన్నారు. రానున్న రోజుల్లో తానే రైల్వే మినిస్టర్ అవుతానని, అప్పుడు ఇక్కడ సమస్యలు అన్ని పరిష్కరిస్తానని అన్నారు. అదేవిధంగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎం చెప్పిన విధంగా కాంగ్రెస్ పార్టీ నడుచుకుంఉటందని విమర్శించారు.
kvcs
బీఆర్ఎస్ పార్టీ ప్రభావం కోల్పోయిందని, ప్రజలే ఆ పార్టీని బొంద పెడుతున్నారని అన్నారు. బీజేపీ నుంచి త్వరలోనే అభ్యర్థిని నిర్ణయిస్తారని తెలిపారు. ఉప ఎన్నికల్లో పోరాడుతామని, 90 వేలకు పైగా ఓట్లను రాబడుతామని దీమా వ్యక్తం చేశారు. మరోవైపు వికారాబాద్ జిల్లాలో బీజేపీ పార్టీలో వర్గపోరు విషయంపై అడడగా వర్గాలు మంచికే అని అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షులు నా మనిషి అయినప్పటికీ ఆయన రాజకీయాలకు సూట్ కారని అన్నారు. ఆయన నాయకత్వాన్ని ఎవ్వరు కోరుకోవడం లేదన్నారు. ఆయన నాన్ లోకల్ అయినప్పటికి మా కుటుంబ సభ్యులే సహాకారం అందించారని గుర్తుచేశారు. విభేదాలు వచ్చినా కూడా అందరిని కలుపుకోవాలని నచ్చజెప్పినా పరిస్థితిలో మార్పురాలేదని అన్నారు. జిల్లా అధ్యక్షులుగా రాజీనామా ఆయన వ్యక్తిగత వి షయమని అన్నారు.

ఇదికూడా చదవండి…

మీ ఫ్యాక్టరీని మూసేయిస్తా..!