ప్ర‌జా సేవే ధ్యేయం

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్ర‌జా సేవే ధ్యేయం
– చ‌లివేంద్రాల ఏర్పాటుకు చ‌ర్య‌లు
– ఆర్టీసీ బ‌స్టాండ్‌ను ప‌రిశీలించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ప్ర‌జా సేవకు ప్ర‌త్యేక దృష్టిసారిస్తున్న‌ట్లు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. బుధ‌వారం తాండూరు ప‌ట్ట‌ణంలోని ఆర్టీసీ బ‌స్టాండ్‌ను ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప‌రిశీలించారు. త్వ‌ర‌లో బ‌స్టాండ్ ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేస్తున్న చ‌లివేంద్రం ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్బంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ ప్ర‌జా సేవ‌కు క‌ట్టుబ‌డి ఉన్న‌ట్లు పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే అభివృద్ధి ప‌నుల‌ను పూర్తి చేసి తాండూరు రూపురేఖ‌లు మారుస్తామ‌న్నారు. అదేవిధంగా వేస‌విని దృష్టిలో ఉంచుకుని తాండూరు ప‌ట్ట‌ణంలో మూడు చ‌లివేంద్రాల‌ను, నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో 6 చ‌లివేంద్రాల‌ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.
త్వ‌ర‌లోనే వీటీని ప్రారంభించి ప్ర‌జ‌ల‌కు, పాదాచారుల‌కు చ‌లివేంద్రాల సేవ‌ల‌ను అందుబాటులోకి తెస్తామ‌ని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, నాయ‌కులు పి.శ్రీ‌శైల్ రెడ్డి, డాక్ట‌ర్ సంప‌త్ కుమార్, ప‌ట్లోళ్ల న‌ర్సింలు, గోపాల్ రెడ్డి, ఆర్టీసీ డీఎం ప‌విత్ర త‌దిత‌రులు ఉన్నారు.