క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్గా అంకిత్ అనురాగ్

తాండూరు రాజకీయం వికారాబాద్

క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్గా అంకిత్ అనురాగ్
– తాండూరు నియోజకవర్గ కమిటి ఎన్నిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ గా తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన అంకిత్ అనురాగ్ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అంకిత్ అనురాగ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

పట్టణంలోని విలియమూన్ స్కూల్ లో జరిగిన సమావేశంలో తాండూరు క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ గా తనను ఎన్నుకున్నట్లు వెల్లడించారు. తనతో పాటు తాండూరు నియోజకవర్గ కమిటిని మెజార్టీ ఆమోదంతో ఎన్నుకున్నారని తెలిపారు.
kvcs
ఈ సందర్భంగా అంకిత్ అనురాగ్ మాట్లాడుతూ చిన్న వయస్సులోనే పెద్ద బాధ్యతను అప్పగిస్తూ చైర్మన్ గా ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మత పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు. క్రిస్టియన్ మైనార్టీ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మైనార్టీ క్రిస్టియన్ పెద్దలు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

హాజీపూర్ అనాథ అక్కా చెల్లెళ్లకు చేయూత