బయో మైనింగ్‌తో చెత్త క్లీన్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బయో మైనింగ్‌తో చెత్త క్లీన్..!
– డంపింగ్‌ యార్డులో సమస్యకు పరిష్కారం
– తాండూరు మున్సిపల్ కమీషనర్ యాదగిరి
– ఎలా క్లీన్ చేస్తారో చెప్పిన కమీషనర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ డంపింగ్ యార్డులో చెత్తను క్లీన్ చేసేందుకు అధికార యంత్రాంగం సిద్దమైంది. డంపింగ్‌ యార్డులో చెత్తను బయో మైనింగ్ చేసేందుకు చర్యలు చేపట్టారు.

ఈ నిర్ణయాన్ని మున్సిపల్ కమీషనర్ యాదగిరి ప్రకటించారు. మంగళవారం అంతారం గ్రామ సమీపంలో ఉన్న మున్సిపల్ డంపింగ్ యార్డును కమీషనర్ యాదగరి సందర్శించారు. మున్సిపల్ డీఈ మణిపాల్, ఏఈ ఖాజా హుస్సేన్, ఉదయ్ కుమార్, ఈఈ ప్రవీన్ గౌడ్, శానిటరీ ఇను స్పెక్టర్ వెంకటయ్యలతో కలిసి యార్డును పరిశీలించారు. యారడ్లో పేరుకుపోయిన చెత్త తొలగింపుకు తీసువస్తున్న బయో మైనింగ్ యంత్రం తీరును పరిశీలించారు.

ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ డంపింగ్ యార్డులో బయో మైనింగ్ విధానం వల్ల పేరుకుపోయిన చెత్త సమస్యకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. బయో మైనింగ్ విధానం వల్ల చెత్త క్లీన్ అవుతుందని అన్నారు. చెత్త నిల్వలను బయో మైనింగ్ చేయడం వల్ల చెత్తలోని వ్యర్థాలు వేరు అవుతాయని అన్నారు. చెత్త క్లీన్ చేసిన తరువాత వ్యర్థాలను ఉపయోగించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అదేవిధంగా వ్యర్థాలను వేరు చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యం తగ్గుతుందని, చెత్త దుర్వాసన, దోమలు, ఈగల సమస్యలు తగ్గుముఖం పడతాయన్నారు. మున్సిపల్ డంపింగ్ యార్డును శుభ్రంగా మారుస్తామని అన్నారు.

ఇదికూడా చదవండి…

https://www.dharshininews.com/39965/

 

కాంగ్రెస్ వస్తే మళ్లీ మోసమే..!