గ్రామ అభివృద్ధికి కృషి చేయండి
– జుంటుపల్లి నూతన సర్పంచుతో బీఎస్ఆర్
– శ్రీనివాస్ రెడ్డికి సర్పంచు వాణీగౌడ్ దపంతుల సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : అందరి సహాకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేయాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి యాలాల మండలం జుంటుపల్లి గ్రామ నూతన సర్పంచ్ వాణిగౌడ్‌కు సూచించారు.

తొలివిడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో జుంటుపల్లి సర్పంచుగా వాణిగౌడ్ గెలుపొందారు. ఇందులో భాగంగా ఆదివారం సర్పంచు వాణిగౌడ్ దంపతులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీనివాస్ రెడ్డిని శాలువాతో సత్కరించి పూలమాలతో ఘనంగా సన్మానించారు.

ఎన్నికల్లో అందించిన సహాకారంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్ వాణి గౌడ్ దంపతులకు అభినందనలు తెలిపారు. ఎన్నికలు ముగిశాయని, పార్టీలకతీతంగా జుంటుపల్లిని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేలా సమర్థవంతమైన పాలన అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు హరిహర గౌడ్, లోకేష్, వికాష్ జోషి, కిషోర్ గౌడ్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

