రాముని గుడికి రూ.50వేల విరాళం
– అందించిన డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం ఇందిరానగర్ లోని శ్రీరామ మందిరం దేవాలయ పునర్ నిర్మాణానికి డీసీసీ అధ్యక్షులు ధారాసింగ్ తనవంతు చేయూతను అందించారు.

ఆదివారం దేవాలయ కమిటి సభ్యులు ధారాసింగ్ ను కలిశారు. దేవాలయ పునర్ నిర్మాణం కోసం సంప్రదించారు. ఇందుకు ధారాసింగ్ నాయక్ స్పందించి రూ.50వేల విరాళం అందించారు. అనంతరం దేవాలయ కమిటి సభ్యులు ధారాసింగ్ ను సన్మానించి.. కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా రామ మందిర దేవాలయ పునర్ నిర్మాణానికి దాతలు ముందుకు వచ్చి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

