పైకి కూరగాయల బిజినెస్

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

పైకి కూరగాయల బిజినెస్
– గుట్టుగా గంజాయి దందా
– అదుపులోకి తీసుకుని అరెస్టు చేసిన పోలీసులు
– వెల్లడించిన పట్టణ ఎస్ఐ అంబర్యా
తాండూరు, దర్శిని ప్రతినిధి : గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న కూరగాయల వ్యాపారిపై తాండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటన సోమవారం జరిగింది.

పట్టణ ఎస్ఐ అంబర్యా తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తాండూరు పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలోని మహమ్మద్ షకీల్ పాష కూరగాయల వ్యాపారం చేస్తున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ మలక్ పేట్లో ఉంటుండగా గంజాయి విక్రయాలకు పాల్పడుతున్నాడు. సోమవారం ఉదయం తాండూరు పట్టణ పోలీసులకు సమాచారం అందింది.

ఈ మేరకు పట్టణ ఎస్ఐ అంబర్యా తన సిబ్బందితో కలిసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద ఉన్న 1800 గ్రాముల ఎండు గంజాయి స్వాదీనం చేసుకున్నారు. దీని విలువ రూ. 52వేలు ఉంటుందని ఎస్ఐ అంబర్యా తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై ఎన్డీపీఎస్ చట్టం ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.

ఇదికూడా చదవండి…

మందుబాబులకు షాక్…!