ఒకే వార్డులో మూడు వార్డుల ఓటర్లు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

ఒకే వార్డులో మూడు వార్డుల ఓటర్లు..!
– ముసాయిదా జాబితాలో వెలుగులోకి
– సుమారు 445 మంది ఓటర్లపై అభ్యంతరం
– మున్సిపల్ అధికారులకు యువనాయకుడి ఫిర్యాదు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్దమవుతోంది. ఇందులో భాగంగా విడుదల చేసిన ముసాయిదా జాబితాతో హడావుడి మొదలైంది.

అధికారులు విడుదల చేసిన ముసాయిదా జాబితాలో తప్పులు, చేర్పులు పరిశీలనలో ఆశావాహులు నిమగ్నమయ్యారు. ఈ పరిణామాలతో ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు మొదలవుతున్నాయి. తాండూరు పట్టణంలోని ఓ వార్డులో అదే వార్డుకు చెందిన ఓటర్లతో పాటు మరో రెండు ఓటర్లు ఉన్నట్లు ముసాయిదా జాబితాలో వెలుగులోకి వచ్చింది. దీనిపై బీఆర్ఎస్ యువనాయకుడు ఎజాజ్ మున్సిపల్ కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు.

పట్టణంలోని 25వ వార్డులో 2499 ఓటర్లు ఉండగా 1200 మంది పురుషులు, 1299 మంది మహిళలు ఉన్నట్లు ముసాయిదా జాబితాలో ఉన్నట్లు ప్రకటించారు. అయితే దీనిపై ఎజాజ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 25వ వార్డులో పట్టణంలోని 26, 27వ వార్డులకు చెందిన ఓటర్లను చేర్చారని అభ్యంతరం తెలిపారు. ఆయా వార్డుల నుంచి సుమారు 455 మందిని 25వ వార్డులో ఓటర్లుగా చేర్చారని తెలిపారు. ఓటర్ల జాబితా నుండి వరుస సంఖ్య 2021 నుండి 2468 వరకు, 2487 నుండి 2495 వరకు ఉన్న ఓటర్లను తొలగించి, అవసరమైన వాటిని చేయాలని కోరారు. అధికారులు విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 25వ వార్డులో అదే వార్డుతో పాటు 26,27వ వార్డులలో మొత్తం మూడు వార్డుల ఓటర్లు ఉన్నట్లు కనిపిస్తొంది.

ఇదికూడా చదవండి…

శ్రీశైలం పాదయాత్ర భక్తులకు అన్నదానం