ప్రభుత్వ పాఠశాలల బలోపేతం అందరి బాధ్యత
– సర్కారు బడుల్లోనే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య
– విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఘనంగా నియోజకవర్గ విద్యావారోత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వంతో పాటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో అందరు బాధ్యత తీసుకోవాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

బుధవారం తాండూరు పట్టణం ఎస్వీఆర్ పంక్షన్ హాల్లో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా తాండూరు నియోజకవర్గ స్థాయి విద్య వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలల్లో నే చదివానని గుర్తుచేశారు.

అప్పట్లో మౌళిక సదుపాయాలు ఉండేవి కావని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై దృష్టిసారిస్తోందని అన్నారు. పాఠశాలల అభివృద్ధి కోసం అమ్మ ఆదరణ కమిటిలను వేసిందని అన్నారు. పాఠశాలల ప్రారంభం రోజే విద్యార్థులకు యూనిఫామ్, పుస్తకాలు ఉచితంగా అందించడం జరుగుతుందన్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ఎంత బాధ్యతుందో సర్పంచ్ లకు, కౌన్సిలర్ లకు అంతే బాధ్యత ఉందని అన్నారు.

చదువుకుంటేనే గౌరవం దక్కుతుందని, అదే మనకు ఆస్తిలాంటిదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చదువుల్లో టాపర్లుగా నిలవాలని అన్నారు. అదేవిధంగా ఆటలు, సాంస్కృతిక రంగాల్లో ముందుండాలని అన్నారు. అనంతరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా అవార్డులు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పట్లోళ్ల నీరజా బాల్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్, ఎంఈఓ ఇందుప్రియ, కౌన్సిలర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


