మున్సిపల్ కార్మికుల సేవలు మ‌రువ‌లేనివి

తాండూరు వికారాబాద్

మున్సిపల్ కార్మికుల సేవలు మ‌రువ‌లేనివి
– తాండూరు ఆర్డీఓ, ఇంచార్జ్ క‌మీష‌న‌ర్‌ అశోక్ కుమార్
– పారిశుద్ధ్య కార్మికులకు దుస్తుల పంపిణీ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: స్వచ్ఛ పట్టణంతో పాటు ప్ర‌జా ఆరోగ్య రక్షణలో మున్సిపల్ కార్మికుల సేవలు కీలకమైనవని తాండూరు ఆర్డీఓ, మున్సిపల్ ఇంచార్జ్ కమీషనర్ అశోక్ కుమార్ అన్నారు. తాండూరు మున్సిప‌ల్ నూతన కార్యాలయ ప్రారంభోత్సవాన్నిపుర‌స్క‌రించుకుని సోమ‌వారం పారిశుధ్ధ్య కార్మికులకు కొత్త దుస్త‌లు పంపిణీ ఏర్పాటు చేశారు.
ఈ సంద‌ర్భంగా ఆర్డీఓ అశోక్ కుమార్ మున్సిప‌ల్ కౌన్సిల‌ర్ల‌తో క‌లిసి కార్మికులకు దుస్తులను పంపిణీ చేశారు. అనంత‌రం ఆర్డీఓ, కౌన్సిల‌ర్లు మాట్లాడుతూ కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన మరువలేనివన్నారు. పట్టణ పరిశుభ్రతలో… ప్రజా ఆరోగ్య రక్షణలో కార్మికుల సేవలు కీల‌క‌ పాత్ర వహిస్తాయన్నారు. కార్మికులందరు క‌రోనా, ఓమిక్రాన్ వైరస్లను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తలు పాటించి సేవలందించాలని సూచించారు. మరోవైపు మున్సిపల్ వైస్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆధ్వర్యంలో కార్మికులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, నీరజా రెడ్డి, సాహు శ్రీలత, సంగీత ఠాకూర్, ప్రభాకర్ గౌడ్, సోమశేఖర్, ఆసిఫ్, మధుబాల, మమత, బాలప్ప, రాము, భీంసింగ్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.