స్వచ్ఛ తాండూరు లక్ష్యం..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

స్వచ్ఛ తాండూరు లక్ష్యం..!
– ఇంటింటా వర్మి కంపోస్తుపై అవగాహన
– తడిచెత్త, పొడిచెత్త వేర్వేరుగా సేకరణ తప్పనిసరి
– మెప్మా ఆర్పీలతో కానిటరీ ఇను స్పెక్టర్ శ్యాంసుంద‌ర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : స్వచ్ఛ సర్వేక్షణ్‌లో తాండూరును ఆదర్శంగా నిలవడమే లక్ష్యంగా అందరు పనిచేయాలని మున్సిపల్ శానిటరీ ఇను స్పెక్టర్ శ్యాంసుందర్ సూచించారు. మంగళవారం మున్సిపల్ కొత్త భవనంలో ఇంచార్జ్ కమీషనర్, ఆర్డీఓ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు మెప్మా ఆర్ఫీలతో స్వచ్ఛ సర్వేక్షన్ 2022 కార్యక్రమంలో భాగంగా తడిచెత్త, పొడిచెత్త సేకరణ, ప్లాస్టిక్ నియంత్రణ, హోం కంపోస్టు తయారీ విధానాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శానిటరీ ఇను స్పెక్టర్ శ్యాంసుందర్ మాట్లాడుతూ తాండూరును పరిశుభ్రంగా ఉంచడంలో అందరు తడి చెత్త, పొడిచెత్త వేరుగా అందించేలా ఆర్సీలు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
ఆర్పీలు ఇంటింటా తడి చెత్తతో హోం కంపోస్టు వ్యవస్థను ఏర్పాటు చేసి వారి పరిధిలోకి కాలనీలలో హోం కంపోస్టును తయారు చేసేలా చూడాలన్నారు. దీంతో పాటు పట్టణంలో ప్లాస్టిక్ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసేలా ప్రజల్లో చైతన్యం కల్పించాలని పేర్కొన్నారు. అన్నింటిని సక్రమంగా అమలు చేసి స్వచ్ఛ సర్వేక్షన్లో తాండూరుకు ఉత్తమ ర్యాంకు వచ్చేలా అందరు కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోడీఎంసీ ర‌వికుమార్, టీఎంసీ వెంకటేష్, మున్సిపల్ జవాన్లు, సిబ్బంది తదతరులు పాల్గొన్నారు.