207 మందికి జైపూర్ కాళ్లు, కెలిఫర్ పరికరాలు

తాండూరు వికారాబాద్

207 మందికి జైపూర్ కాళ్లు, కెలిఫర్ పరికరాలు
– రేపు, ఎల్లుండి ఉచితంగా అందించ‌నున్న మార్వాడి యువ‌మంచ్
తాండూరు, దర్శిని ప్ర‌తినిధి : తాండూరు మార్వాడి యువమంచ్ స‌భ్యులు 207 మంది విక‌లాంగుల‌కు చేయూత‌నందించ‌బోతున్నారు. రేపు, ఎల్లుండి వారికి ఉచితంగా జైపూర్ కాళ్లు, కెలిఫ‌ర్, కృతిమ చేతుల‌ను అందించ‌బోతున్నారు. గ‌త రెండు రోజుల నుంచి ప‌ట్ట‌ణంలోని బాలాజీ మందిర్‌లో మంచ్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన జైపూర్ కాళ్లు, కెలిఫ‌ర్ శిబిరం బుధవారం ముగిసిందని మంచ్ జాతీయ సభ్యులు మన్మోహన్ సర్దా, క్యాంపు చైర్మన్ సునిల్ సార్థాలు తెలిపారు.
మూడురోజులుగా నిర్వహించిన శిబిరంలో 207 మంది నుంచి జైపూర్ కాళ్లు, కెలిఫర్ పరికరాలతో పాటు పొలియో గ్రస్తులకు కృతిమ చేతులను అమర్చడం కోసం కొలతలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇందులో 117 మందికి జైపూర్ కాళ్లు, 16 మందికి కృతిమ చేతులు, 74 మందికి కెలిఫర్ పరికరాలను నేడు, రేపు ఉచితంగా అందజేయడం జరుగుతుందన్నారు.
మరోవైపు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి వారి నియోజకవర్గం నుంచి 12 మంది వికలాంగులను సొంత ఖర్చులతో పంపించగా 9 మంది వికలాంగులకు జైపూర్ కాళ్లు, ముగ్గురికి కృతిమ చేతులను అమర్చి పంపించడం జరిగిందని తెలిపారు. శిబిరంలో పేర్లను నమోదు చేసుకున్న వికలాంగులు నేడు ఉదయం పట్టణంలోని బాలాజీ మందిర్లోని క్యాంపుకు రావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచ్ జాతీయ కన్వినర్ కుంజ్ బిహారి సోని, రాష్ట్ర కన్వినర్ అనిల్ సార్థా, అధ్యక్షులు సన్ని అగ్రవాల్, కరణ్ జైన్, మధు పసారి, మధూసదన్ సార్దా, దీపక్ గగ్రాని, రమాకాంత్ సార్థా, ఓం తివారి తదితరులు పాల్గొన్నారు.