పడిపూజకు ముమ్మర ఏర్పాట్లు
– 5వేల భక్తులు వస్తున్నట్లు అంచనా
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ అయ్యప్ప పడిపూజ మహోత్సవానికి ముమ్మర ఏర్పాట్లు జరిగాయి. బుధవారం సాయంత్రం 6 గంటలకు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో అయ్యప్ప పడిపూజ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
మాల ధరించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి తాండూరులో ప్రతి యేడాది అయ్యప్ప పడిపూజను వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ యేడాది కూడ నిర్వహిస్తున్న పడిపూజను దృష్టిలో ఉంచుకుని కళాశాల ఆవరణలో పడిపూజకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. పడిపూజకు వచ్చే అయ్యప్ప స్వాములకు, సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ వసతులతో ఏర్పాట్లను చేస్తున్నారు.
తాండూరు నియోజకవర్గంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన అయ్యప్ప స్వాములు, సాధారణ భక్తులు, రాజకీయ ప్రముఖులందిరితో కలిపి పడిపూజకు దాదాపు 5 వేల మంది విచ్చేస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్లను ఏర్పాటు చేస్తుతండంతో కళాశాలలో పడిపూజ సందడి నెలకొంది. మరోవైపు టీఆర్ఎస్ నాయకులు పడిపూజ ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు.
