కాంగ్రెస్‌తోనే అభివృద్ధి పునాదులు
– పార్టీకి పూర్వవైభవం తీసుకరావాలి
– టీపీసీసీ ఉపాధ్యక్షులు ఎం. రమేష్ మహారాజ్
– తాండూరులో ఘనంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : దేశంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి పునాదులు వేసిందని ఆ పార్టీ టీపీసీసీ ఉపాధ్యక్షులు, తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఎం. రమేష్ మహారాజ్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ 137వ ఆవిర్భావ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షులు రమేష్ మహారాజ్ హాజరై కాంగ్రెస్ పార్టీ కార్యాలయంతో పాటు చౌరస్తాలోని ఇందిరాగాంధీ విగ్రహం ముందు పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల మేరకు తాండూరు నియోజకవర్గంలో పార్టీకోసం నాలుగు దశాబ్దాలుగా పనిచేస్తున్న నాయకులను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎం. రమేష్ మహారాజ్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం తరువాత కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నాటి నుంచి మహాత్మగాంధీ ఆశయాలతో నెహ్రు, ఇందిరాగాంధీలు పనిచేశారన్నారు. వారితో పాటు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ సాంకేతిక రంగంలో దేశాన్ని అభివృద్ధి చేశారన్నారు. దేశాన్ని అభివృద్ధి చె చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవానికి అందరు కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ చేస్తున్న కార్యక్రమాలకు అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సర్దార్ ఖాన్, కోర్వార్ నగేష్, సయ్యద్ షుకూర్, మాజీ వైస్ చైర్మన్ ఎంఏ ఆలీం, యాలాల మండల అధ్యక్షులు భీమయ్య, కోఆప్షన్ ఫోరం నాయకులు ఆక్బర్ బాబా, యువనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
