మహేంద్రుడిపై త‌గ్గ‌ని అభిమానం..!

తాండూరు వికారాబాద్

మహేంద్రుడిపై త‌గ్గ‌ని అభిమానం..!
– క‌రోనా నుంచి కోలుకోవాల‌ని కొన‌సాగుతున్న పూజ‌లు
యాలాల‌, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మ‌హేందర్ రెడ్డిపై టీఆర్ఎస్ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌కు అభిమానం త‌గ్గ‌డంలేదు. క‌రోనా బారిన ప‌డిన ఎమ్మెల్సీ మ‌హేంద‌ర్ రెడ్డి కోలుకోవాల‌ని తాండూరు నియోజ‌క‌వ‌ర్గంలో మూడు రోజులుగా దేవాల‌యాలు, మ‌సీదులు, చెర్చిల‌లో పూజ‌లు, ప్రార్థ‌న‌లు చేస్తున్నారు. బుధ‌వారం కూడ మ‌హేంద‌ర్ రెడ్డిపై అభిమానంతో పూజ‌లు కొన‌సాగించారు. యాలాల మండ‌ల కేంద్రంలో మండల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలో వెల‌సిన భవాని మాత మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నాగారం పాండు గౌడ్, ఉపసర్పంచ్ గొల్ల శ్రీనివాస్, GV రెడ్డి, అన్నారం రాజు, గడ్డం శ్రీనివాస్, రాపోలు రాములు, భాస్కర చారి, కమర్తి బసప్ప, కొప్పుల సాయిలు, దుర్కి శివకుమార్, శేఖర్, పొస లాలూ, యువకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మ‌రోవైపు ముద్దాయిపేట్‌లోని సంగ‌మేశ్వ‌ర ఆల‌యంలో ఎంపీటీసీ దేవ‌గారి రాములు, నాయ‌కులు ర‌మేష్, గ్రామ పెద్ద‌లు, కార్య‌క‌ర్త‌లు పూజ‌లు నిర్వ‌హించారు. క‌రోనా నుంచి మ‌హేంద‌ర్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకోవాల‌ని కాంక్షిస్తూ పూజ‌లు నిర్వ‌హించారు.