23న బంగారు ఆభరణాల వర్తకులు సమ్మె

తెలంగాణ

23న బంగారు ఆభరణాల వర్తకులు సమ్మె
– గోల్డ్‌ హాల్‌మార్కింగ్‌ను వ్యతిరేకిస్తూ నిర్ణ‌యం
ద‌ర్శిని ప్ర‌తినిధి: దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలకు హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరిచేస్తూ బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్స్‌ (బీఐఎస్‌) ఏకపక్షంగా విధించిన నిబంధనలకు నిరసనగా ఈనెల 23న ఆభరణాల వర్తకులు సమ్మె చేస్తున్నట్లు ఆల్‌ ఇండియా జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (GJC) తెలిపింది. బంగారం కొనుగోలుదారులను దృష్టిలో ఉంచుకుని బంగారు అభరణాలకు హాల్‌ మార్కింగ్‌ విధానాన్ని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో గోల్డ్ హాల్​మార్కింగ్​జూన్​15 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ దీని ప్రకారం.. ఇకపై వ్యాపారులు హాల్​మార్క్​ లేని బంగారు ఆభరణాలను విక్రయించడానికి వీలులేదు. ఒకవేళ హాల్‌మార్కింగ్‌ లేకుండా అభరణాలను విక్రయించినట్లయితే వారిపై చర్యలు తీసుకుంటారు. ఈ కొత్త విధానంపై వ్యాపారుల నుంచి బీఐఎస్‌కు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలకు హాల్‌ మార్కింగ్‌ తప్పనిసరిచేస్తూ ఏకపక్షంగా విధించిన నిబంధనలకు నిరసనగా ఈనెల 23న ఆభరణాల వర్తకులు సమ్మె చేస్తున్నట్లు ఆల్‌ ఇండియా జెమ్స్‌ అండ్‌ జ్యువెలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ (GJC) తెలిపింది. దేశంలోని ప్రతి ప్రాంతంలో ఉన్న 350 అభరణాల సంఘాలు సమ్మెకు మద్దతు ఇస్తున్నాయని తెలిపింది. దేశంలో దశలవారీగా అభరణాలకు హాల్‌మార్కింగ్‌ విధానం అందుబాటులోకి రాగా, మొదటి దశ అమలు కోసం ప్రభుత్వం 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 256 జిల్లాలను గుర్తించింది. స్వర్ణకారులు కొత్తగా తీసుకువచ్చిన హాల్‌మార్కింగ్‌ విధానం స్వీకరించలేరని, బంగారం స్వచ్ఛతతో ఎలాంటి సంబంధం లేదని జీజేసీ మాజీ అధ్యక్షుడు అశోక్‌ మీనావాలా అన్నారు.