రేప‌టి నుంచి శ్రీశైలానికి ఆర్టీసీ సర్వీసులు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

రేప‌టి నుంచి శ్రీశైలానికి ఆర్టీసీ సర్వీసులు
– వివిధ డీపోల నుంచి 155 బ‌స్సులు
– ఆర్టీసీ రీజినల్ మేనేజర్ వర ప్రసాద్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : శ్రీ‌శైలంలో జ‌రిగే మ‌హా శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాల‌కు ఆర్టీసీ బ‌స్సు స‌ర్వీసుల‌ను అందించ‌డం జ‌రుగుతుంద‌ని ఆ శాఖ రంగారెడ్డి రీజినల్ మేనేజర్ వరప్రసాద్ తెలిపారు. శనివారం తాండూరు పట్టణంలోని ఆర్టీసీ డిపోను ఆయన సందర్శించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా గత డీఎం రాజశేఖర్, ప్రస్తుత డీఎం పవిత్రలతో కలిసి డీపోలోని ఆర్టీ న బస్సుల వివరాలు, పనితీరు, గ్యారేజ్ నిర్వహణ తదితర విభాగాలను పరిశీలించారు. ఆర్టీసీ ఆధాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ ప్రాంగణంలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మేడారంలోని సమ్మక్క, సారక్క జాతర ఉత్సవాలకు 100 బస్సులను నడిపించడం జరిగిందని, దాదాపు 512 ట్రిప్పులతో ఆర్టీసీకి రూ. 1 కోటి 60 లక్షల ఆధాయం వచ్చిందని వెల్లడించారు. అదేవిధంగా రేప‌టి నుంచి శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు వివిధ డిపోల నుంచి 155 బస్సులను నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో పాటు ప్రస్తుతం ఆర్టీసీ నష్టాల్లో ఉన్న ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే కార్లో పార్సిల్ సేవలను ప్రవేశ పెట్టడం జరిగిందని, ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్టీసీకి సహకరించాలని అన్నారు. మరోవైపు. తాండూరు డిపోలోని 90 బస్సుల్లో కొన్ని బస్సులను మహబూబ్ నగర్, శ్రీశైలం వంటి దూర ప్రాంతాలకు నడిపిస్తున్నామని, త్వరలోనే పూర్తిస్థాయిలో బస్సు సర్వీసులను అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, సిబ్బంది ఉన్నారు.