భద్రాచలం గోదావరికి పెరుగుతున్న నీటిమట్టం
దర్శిని ప్రతినిధి : భద్రాచలం వద్ద గోదావరికి నీటిమట్టం పెరుగుతోంది. గత రెండు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉధృతి కొనసాగుతోంది. నీటిప్రవాహం పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరి స్నానఘట్టాలు నీట మునిగాయి. రెండు రోజుల క్రితం 22.5 అడుగులున్న నది నీటిమట్టం శనివారం 25అడుగులుండగా, ఆదివారం 29.6అడుగులకు చేరుకుంది. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.
