వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి మ‌నఊరు – మ‌న‌బ‌డి

తాండూరు మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్

వ‌చ్చే విద్యాసంవ‌త్స‌రం నుంచి మ‌నఊరు – మ‌న‌బ‌డి
– విద్యారంగాన్ని ప‌టిష్టం చేసేలా స‌ర్కారు బోధ‌న
– కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం కేసీఆర్
– వ‌న‌ప‌ర్తి జిల్లాలో లాంచ‌నంగా ప్రారంభం
ద‌ర్శిని డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని ప‌టిష్టం చేసేందుకు స‌ర్కారు ఆధ్వ‌ర్యంలో మ‌న ఊరు – మ‌న బ‌డికి కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేయబోతున్న‌ట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంగ‌ళ‌వారం వ‌న‌ప‌ర్తి జిల్లాలో ప‌ర్య‌టించిన సీఎం కేసీఆర్ స్థానిక జిల్లా ప‌రిష‌త్ బాలుర ఉన్న‌త పాఠ‌శాల‌లో మ‌న ఊరు – మ‌న బ‌డి కార్య‌క్ర‌మాన్ని లాంచ‌నంగా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత పటిష్టం చేసేందుకే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు చెప్పారు సీఎం కేసీఆర్. తామంతా సర్కారీ బడుల్లో చదివి పైకి వచ్చినవాళ్లమేనని గుర్తుచేశారు. త్వరలోనే ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభం అవుతుందన్నారు. విద్యార్థులంతా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు సీఎం కేసీఆర్. వ‌చ్చే విద్యా సంవ‌త్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియంలో బోధ‌న ప్రారంభిస్తామ‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) స్పష్టం చేశారు. అంత‌కుముందు మ‌న ఊరు – మ‌న బ‌డి పైలాన్‌ను సీఎం కేసీఆర్, మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, నిరంజ‌న్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ క‌లిసి ఆవిష్క‌రించారు. మ‌రోవైపు వనపర్తిలో అన్నిహంగులతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను ప్రారంభించారు CM కేసీఆర్. అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు.