వైభవంగా వాసవీ కన్యాకా పరమేశ్వరి జయంతి
– అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే
– దర్శించుకున్న ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవాలు తాండూరులో వైభవంగా జరిగాయి. బుధవారం తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో వెలసిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ కుంచెం మురళీధర్ ఆధ్వర్యంలో పల్లకి సేవతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. జయంతి సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాసవీ మాతకు పట్టువస్త్రాలను సమర్పించారు.
అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మరోవైపు తాండూరులోని ఆర్యవైశ్య సంఘం సభ్యులు, వాసవీ మహిళా సంఘం, సమాజం పెద్దలు, మహిళలు, ప్రజా ప్రతినిధులు, కౌన్సిలర్లు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, వార్డు కౌన్సిలర్ సిందూజ నరేందర్ గౌడ్, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సాహు శ్రీలత, బీజేపీ నాయకులు నరేందర్ గౌడ్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు కట్కం వీరేందర్, మురళి, ఆలంపల్లి శ్రీనివాస్, రొంపల్లి సంతోష్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు రాజుగౌడ్, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


