అద్దెకు ఆర్టీసీ కార్గో, పార్సిల్ పాయింట్లు

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

అద్దెకు ఆర్టీసీ కార్గో, పార్సిల్ పాయింట్లు
– తాండూరు, కోడంగ‌ల్ కేంద్రాల‌కు టెండ‌ర్ల ఆహ్వానం
– వెల్ల‌డించిన తాండూరు డీపో మేనేజ‌ర్ రాజ‌శేఖ‌ర్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: ఆర్టీసీ ద‌శ‌ను మార్చేందుకు ప్ర‌వేశ పెట్టిన కార్గో, కోరియ‌ర్ పార్సిల్ స‌ర్వీసుల‌ను ప్ర‌వేటుకు అప్ప‌గించాల‌ని నిర్ణ‌యించారు. ఇందులో భాగంగా తాండూరు, కోడంగ‌ల్ ఆర్టీసీ బ‌స్టాండ్‌ల‌లో ఉన్న కార్గో, పార్సిల్ కేంద్రాల‌ను అద్దెకు ఇవ్వ‌బోతున్న‌ట్లు తాండూరు ఆర్టీసీ డీపో మేనేజ‌ర్ రాజ‌శేఖ‌ర్ గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈనెల‌ 27వ నుంచి వ‌చ్చే నెల 2 వ తేది వరకు టెండ‌ర్లు తెరిచి ఉంటాయ‌ని వెల్ల‌డించారు. తాండూర్ డిపో మేనేజర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు టెండ‌ర్ ఫారాల‌ను విక్ర‌యించ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు. తాండూరు కార్గో పాయింట్ కోసం రూ. 885 లు, కోడంగ‌ల్ కార్గో పాయింట్ కోసం రూ.295లు చెల్లించాల్సి ఉంటుంద‌ని, పూర్తి చేసిన ఫారాల‌ను వ‌చ్చే నెల 3వ తేది ఉదయం 10-30 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2 గంట‌లలోపు టెండర్ బాక్సులో వేయాల‌ని సూచించారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు టెండ‌ర్లను పూర్తి చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. ఆస‌క్తిగ‌ల వారు ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.