ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో డీఎస్పీ శేఖర్ గౌడ్ భేటీ
– మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్పీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో డీఎస్పీ జి.శేఖర్ గౌడ్ భేటీ అయ్యారు. తాండూరు డీఎస్పీ లక్ష్మీనారాయణ స్థానంలో నూతన డీఎస్పీగా శేఖర్ గౌడ్ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా డీఎస్పీ శేఖర్ గౌడ్ బుధవారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాండూరు డివిజన్‌లో శాంతి భద్రతల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, పోలీసు వ్యవస్థ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. తాండూరు డీఎస్పీగా పనిచేసిన లక్ష్మీనారాయణ హైదరాబాద్ హెడ్ ఆఫీసుకు బదిలీ కాగా ఆయన స్థానంలో ఖమ్మం నుంచి జి.శేఖర్ గౌడ్ తాండూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.

