క‌రుణించుకు ఎల్ల‌మ్మ త‌ల్లీ..!

తాండూరు రంగారెడ్డి వికారాబాద్

క‌రుణించుకు ఎల్ల‌మ్మ త‌ల్లీ..!
– ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌లో రేణుక ఎల‌మ్మ
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: క‌రుణించు ఎల్ల‌మ్మ త‌ల్లీ అంటూ భ‌క్తులు తాండూరు ప‌ట్ట‌ణం నెహ్రు గంజ్‌లోని రేణుకా ఎల్ల‌మ్మ‌ను వేడుకున్నారు. శ్రావ‌ణ‌మాసం మూడో శుక్ర‌వారం సంద‌ర్భంగా ఆల‌య పూజారి అంబ్రేష్ పంతులు అమ్మ‌వారిని వేపాకుల‌తో ప్ర‌త్యేక అలంక‌ర‌ణ చేశారు. అమ్మ‌వారికి పూజ‌లు, అర్చ‌న‌లు చేశారు. శ్రావ‌ణ శుక్ర‌వారం సంద‌ర్భంగా ఆల‌యంలో వెల‌సిన అమ్మ‌వారిని ద‌ర్శించుకుని పూజ‌లు నిర్వ‌హించారు.