మంగ‌ళ హార‌తి స‌మ‌ర్ప‌యామి..!

తాండూరు వికారాబాద్

మంగ‌ళ హార‌తి స‌మ‌ర్ప‌యామి..!
– బోన‌మ్మ దేవాల‌యంలో ఆధ్యాత్మిక శోభ‌
– వైభవంగా మహా మంగళ హారతి వార్షికోత్సవం
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరులో వెలసిన శ్రీ బోనమ్మ దేవాలయంలో అమ్మ‌వారికి మహా మంగళ హారతి స‌మ‌ర్ప‌ణ వైభ‌వంగా జ‌రిగింది. గ‌త యేడాది విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో పలు దేవాలయాలలో మహా మంగళ హారతి కార్యక్రమాన్ని చేపట్టారు. ఆదివారంతో ఈ కార్యక్రమానికి యేడాది పూర్తికావడంతో పాత తాండూరులోని బోనమ్మ దేవాలయంలో మొదటి వార్షికోత్సవ మహా మంగళ హారతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయంలో వెలసిన అమ్మవారిని మహా మంగళ హారతిని సమర్పించారు. భ‌క్తుల రాక‌తో ఆల‌య‌మంతా ఆధ్యాత్మిక శోభ సంత‌రించుకుంది. ఈ కార్యక్రమానికి హాజరైన తెలుగు విశ్వనాథం మాట్లాడుతూ భక్తులు ప్రతినిత్యం దైవనామస్మరణ చేపట్టాలని సూచించారు. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతతో పాటు ధర్మ పరిరక్షణ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా కోశాధికారి విద్యాసాగర్, ప్రతినిధులు గాండ్ల శివరాజ్, సుభాన్ రెడ్డి, బస్వరాజ్, మీది పేట వినోద్, నరేష్, ఆలయ అర్చకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.