కొత్త కార్యవర్గంతో లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారం
– అధ్యక్ష, కార్యదర్శులుగా జహీర్ అహమద్, రొంపల్లి సంతోష్ కుమార్
– నూతనోత్సహంతో సేవలందించాలి
– అభినందించిన బల్దియా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: సేవకు మారుపేరుగా నిలిచే లయన్స్ క్లబ్ తాండూరు శాఖలో కొత్త కార్యవర్గం ఏర్పాటయ్యింది. అనునిత్యం సేవ చేయాలనే యువతరానికి క్లబ్ అధ్యక్ష, కార్యదర్శుల బాధ్యతలను అప్పగించారు. ఇందులో భాగంగా ఆదివారం తాండూరు లయన్స్ క్లబ్ 47వ కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది.

పట్టణంలోని సల్లా గార్డెన్ లో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవానికి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ సూర్యనారాయణ, రీజియన్ చైర్మన్ ఉదయ్ పి.షా, రమేష్ చంద్రపండిత్, జోన్ చైర్మన్ బిక్కుమళ్ల శ్రీధర్లు పాల్గొన్నారు. వారి సమక్షంలో తాండూరు లయన్స్ క్లబ్ నూతన అధ్యక్షులు జహీర్ హైమద్, కార్యదర్శి రొంపల్లి సంతోష్ కుమార్, కోశాధికారి మహమ్మద్ యూసుఫ్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు, అథితులు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ప్రతిష్ట పెంచేలా నూతనోత్సహంతో సేవా కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు.

నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు పట్టణంలోని విజయ విద్యాలయ పాఠశాలకు 10 బెంచీలను వితరణ చేశారు. అదేవిధంగా లయన్స్ క్లబ్ సభ్యత్వంలోకి వీరప్రసాద్, మహమ్మద్ జమీల్ ఇద్దరికి అవకాశం కల్పించి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు సల్లా దామోదర్, ఓం ప్రకాష్ సోమాని, చంద్రశేఖర్, వరప్రసాద్ గునాజీ, రవీందర్ రెడ్డి మురళిధర్, కట్కం వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు లయన్స్ క్లబ్ తాండూరు కార్యదర్శిగా ఎన్నికైన రొంపల్లి సంతోష్ కుమార్ ను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, వాసవీక్లబ్ ఆర్యవైశ్య సంఘం సభ్యులు, స్నేహితులు, అభిమానులు ఘనంగా సన్మానించారు.



