టీఎస్ఆర్ఎస్ ఎస్ఎంసీ నూతన కమిటి ఎన్నిక
– చైర్మన్‌గా రవీందర్ రెడ్డి ఏకగ్రీవం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలం ఖాంజాపూర్ గేటు సమీపంలోని తెలంగాణ రెసిడెన్షియల్ బాలికల స్కూల్, జూనియర్ కాలేజీ(టీఎస్ఆర్ఎస్) ఎస్ఎంసీ నూతన కార్యవర్గ కమిటీ ఆదివారం ఎన్నుకున్నారు. స్కూల్ ప్రిన్సిపల్ శ్రీదేవి, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో కమిటీ ఎన్నికైంది. ఇందులో స్కూల్, కాలేజీ ఎస్ఎంసీ కమిటి నూతన చైర్మన్ గా సి.రవీందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కమిటి గౌరవాధ్యక్షులుగా వి.ప్రభుశంకర్, ఉపాధ్యక్షులుగా చంద్రశేఖర్, కార్యదర్శులుగా ఎం.గోపాల్, సభ్యులుగా హరిక, ఎస్. అనురాధ, లీలావతి, పద్మ, భారతమ్మ, కృష్ణ, నరేందర్, బాలకిష్టమ్మ, ప్రవీణ్ గౌడ్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కమిటి అధ్యక్షులు, సభ్యులు మాట్లాడుతూ పాఠశాల, కళాశాల అభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.



