ఎమ్మెల్యే తండ్రి, బాబాయిలకు ఊరట
– పాత కేసును కొట్టివేసిన న్యాయస్థానం
– న్యాయవాదులను అభినందించిన నేతలు
తాండూరు, దర్శినిప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తండ్రి విఠల్ రెడ్డి, బాబాయ్ శ్రీశైల్ రెడ్డిలపై నమోదు అయిన కేసులో ఊరట లభించింది. వారిపై నమోదైన కేసులో తాండూరు న్యాయస్థానం నిర్దోషులుగా పరిగణించి కేసును కొట్టివేసిందని ప్రముఖ న్యాయవాది కె. గోపాల్ తెలిపారు. 2018 సాధారణ ఎన్నికల సమయంలో నియోజకవర్గంలోని బషీరాబాద్ పోలీస్టేషన్‌లో ఐపీసీ 188 సెక్షన్ కింద ఎమ్మెల్యే తండ్రి విట్టల్ రెడ్డి, బాబాయ్ శ్రీశైల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజరత్నం, నాయకులు నర్సి రెడ్డి, రాజేందర్ రెడ్డి, పప్పు సింగ్ లపై పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం తాండూరు న్యాయస్థానంలో కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి సరైన ఆధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా పరిగణిస్తూ కేసు కొట్టివేస్తూ తీర్పు వెలువరించడం జరిగిందని న్యాయవాది గోపాల్ తెలిపారు. ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులపై ఇప్పటి వరకు 13 కేసులు నమోదు కాగ, చివరి కేసును బుధవారం కొట్టివేసినట్లు తెలిపారు. మరోవైపు ఈ కేసును వాధించిన న్యాయవాది గోపాల్‌తో పాటు వాణిశ్రీ, కె.రవితేజ, కలాంలను టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజు గౌడ్, నాయకులు పట్లోళ్ల నర్సిములు, దేవాలయ చైర్మన్ సుధాకర్ తదితరులు అభినందించారు.


