రండి సైకిల్ యాత్ర చేద్దాం..!

ఆరోగ్యం తాండూరు వికారాబాద్

రండి సైకిల్ యాత్ర చేద్దాం..!
– రేపు తాండూరులో భారీ సైక్లోథాన్
– ఏర్పాట్లు చేసిన మ‌ర్వాడి యువమంచ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: రండి సైకిల్ యాత్ర చేద్దామంటూ తాండూరు మార్వాడి యువమంచ్ స‌భ్యులు పిలుపునిచ్చారు. ఆదివారం నేష‌న‌ల్ స్పోర్స్ట్ డేను పుర‌స్క‌రించుకుని తాండూరులో సైక్లోథాన్ యాత్ర చేప‌డుతున్న‌ట్లు తెలిపారు. అఖిల భార‌త మార్వాడి యువమంచ్ పిలుపు మేర‌కు తాండూరు మార్వాడి యువమంచ్ ప‌ట్ట‌ణంలోని కృష్ణ‌వేణి కాన్సెప్ట్ స్కూల్ సహాకారంతో యాత్ర‌కు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు మంచ్ జాతీయ స‌భ్యులు మ‌న్మోహ‌న్ సార్డా ఓ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు. ఆదివారం ఉద‌యం స‌రిగ్గా 7 గంట‌ల‌కు యాత్ర ప్రారంభ‌మ‌వుతుంద‌ని, అక్క‌డి నుంచి ఇందిరా చౌక్, శివాజీ చౌక్, వీవీహెచ్ఎస్, ఎస్బీఐ బ్యాంకు, గాంధీ చౌక్, భ‌ద్రేశ్వ‌ర చౌక్, మార్వాడి యువ‌మంచ్, డీఎస్పీ కార్యాల‌యం, శాంత్ మ‌హాల్ చౌర‌స్తా, తిరిగి కృష్ణ‌వేణి కాన్సెప్ట్ స్కూల్ వ‌ర‌కు చేరుకుంటుంద‌ని వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హైద‌రాబాద్ సైకిలింగ్ అసోసిసోయేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు, అధ్య‌క్షులు ర‌వీంద‌ర్, హైద‌రాబాద్ సైకిలిస్టులు గ‌డిల ప్ర‌వీణ్‌, భీమ్ శంక‌ర్, రాధేశ్యామ్ తివారి త‌దిత‌రులు పాల్గొంటార‌ని చెప్పారు. అంద‌రు ఆరోగ్యంగా ఉండాలంటే సైకిలింగ్ చేయాల‌ని, సైకిల్ ఉన్న ప్ర‌తి ఒక్క‌రు సైక్లోథాన్ యాత్ర‌లో పాల్గొనాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.