లక్షల విలువైన బైక్ దగ్దం..!
– అర్దరాత్రి నిప్పంటించిన దుండగులు
– తాండూరు సాయిపూర్లో ఘటన
తాండూరు, దర్శిని ప్రతినిధి: లక్షలు పోసి కొన్న అపురూపమైన బైక్ మంటల్లో దగ్దమైపోయింది. ఇంటి నుంచి పార్కింగ్ చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ను గుర్తుతెలియని దుండగులు నిప్పంటించారు. ఈ సంఘటన ఆదివారం అర్దరాత్రి చోటు చేసుకోనగా సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. సాయిపూర్లోని నలంద స్కూల్ సమీప ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి రూ. 1లక్షకు పైగా పెట్టి రాయల్ ఎన్ఫీల్డ్ బైకును కొని నడిపిస్తున్నాడు. అయితే ఆదివారం రాత్రి ఇంటి నుంచి బైక్ను పార్కు చేసి ఇంట్లోకి వెళ్లాడు. కొద్ది సేపటి తరువాత బయటకు వచ్చి చూసే సరికి బైక్ మంటల్లో కాలిపోయింది. మంటలు ఎగిసిపడుతుంటే గమనించిన స్థానికులు వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే జరగాల్సిన నష్టం మొత్తం జరిగిపోయింది. దీంతో బాధితుడు అదేరాత్రి పట్టణ పోలీస్టేషన్ను ఆశ్రయించి జరిగిన సంఘటనపై ఫిర్యాదు చేశారు. నిందితులను గుర్తించి తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు. ఈ సంఘటన తాండూరు పట్టణం సాయిపూర్లో కలకలం రేపింది.అయితే బాధితుడు తన వివరాలను తెలిపేందుకు నిరాకరించారు.

