లేటేం లేదు కానీ..!
– రెండో రోజు 17 మంది గైర్హాజరు
– తాండూరులో ప్రశాతంగా ఇంటర్ పరీక్షలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరులో ఇంటర్ పరీక్షల మొదటి రోజు 6 మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చి పరీక్షకు దూరమైన సంగతి తెలిసిందే. రెండో రోజు అలాంటి సంఘటనలు దాదాపు చోటు చేసుకోలేదు. గురువారం రెండో రోజు తాండూరులో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్ పరీక్షల సందర్భంగా తాండూరులో 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే రెండో రోజు కూడా విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. గురువారం జరిగిన పరీక్షకు ఒకేషనల్, జనరల్ విభాగంలో 2253 మంది విద్యార్థులకు ఆలార్డ్ చేయగా 17 మంది గైర్హాజరుతో 2236 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. జనరల్ విభాగంలో 1710 మంది విద్యార్థులకు గాను 10 మంది గైర్హాజరుతో 1700 మంది పరీక్షలు రాయగా.. ఒకేషనల్ విభాగంలో 543 మందికి గాను 7 మంది గైర్హాజరుతో పాటు 536 మంది పరీక్షలు రాయడం జరిగిందని తాండూరు కస్టడియన్లు మల్లినాథప్ప, కృష్ణయ్యలు తెలిపారు. మొదటి రోజు 113 మంది గైర్హాజరు కాగ సింధు బాలికల జూనియర్ కళాశాల సెంటర్లో 6 మంది విద్యార్థులు ఆలస్యంగా వచ్చి పరీక్షకు దూరమయ్యారు. గురువారం ఆయా సెంటర్ల వద్ద విద్యార్థులు ఆలస్యంగా వచ్చిన సంఘటనలు కనిపించలేదు.

