అంబేద్కర్ కీర్తికి పెద్దపీట..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అంబేద్కర్ కీర్తికి పెద్దపీట..!
– కాంస్య విగ్రహంతో ఆత్మగౌరం పెంపు
– సీఎం కేసీఆర్ స్పూర్తితో 132 విగ్రహాల ప్రతిష్టాపన గర్వకారణం
– జయంతి సభలో తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– తాండూరులో నీలిరంగు ర్యాలీ అదుర్స్
తాండూరు, దర్శిని ప్రతినిధి : భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ కీర్తని పెంచేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు ఆయన జయంతి ఉత్సవాలను జరుపుతోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను తాండూరులో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. జయంతి సందర్భంగా పట్టణంలోని రైతు బజార్లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశంలో ఇంతకుముందు ఏ ప్రభుత్వం, ఏ నాయకుడు ఆలోచించని విధంగా సీఎం కేసీఆర్ అంబేద్కర్ జయంతిని నిర్వహిస్తున్నారని అన్నారు. ప్రపంచమే తలొంచి చూసే విధంగా హైదరాబాద్లో 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ప్రతిష్ఠించడం ఆదర్శనీయమన్నారు. భారత . రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తితో పాటు సీఎం కేసీఆర్ అడుగు జాడల్లో నడిచేలా తాండూరు నియోజకవర్గంలో 132 విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఘనతను తను సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారులో బీఆర్ అంబేద్కర్ కీర్తిని చాటేందుకు పెద్దపీట వేయడం జరగుతుందన్నారు. అన్ని వర్గాలు, కులాలు, మతాలు సమానత్వానికి అంబేద్కర్ జయంతి ఉత్సవాలే నిదర్శనమన్నారు. అన్ని వర్గాలతో పాటు దళితులకు గుర్తింపు తీసుకవచ్చేందుకు సర్కారు దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిందని అన్నారు. ఈ ఘనతను సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాలతో యువత ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(సయూం), యాలాల ఎంపీపీ బాలేశ్వర్ గుప్త, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, దళిత ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

నీలిరంగు మయమైన పురవీధులు
అంబేద్కర్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు, కౌన్సిలర్లు, దళిత, ప్రజా సంఘాల నాయకులు తదితరులు కూడ అంబె ద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ప్రభుత్వ కాలేజీ మైదానం నుంచి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని డీజే సౌండ్ సిస్టమ్లో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను పురస్కరించుకుని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి, దళిత, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటు నేతలు, దళిత ప్రజా సంఘాల నాయకులు నీలి కండువాలు, తలపాగలు చుట్టుకుని ముందుకు సాగారు. పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా పట్టణంలోని రైతు బజార్ వద్దకు ర్యాలీ కొనసాగింది. నీలి రంగు జెండాలు, కండువాలు, తలపాగలతో పురవీధులు మొత్తం నీలిరంగు మయంగా మారింది. ర్యాలీలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.