రూ. 35 పైసలతో రైలు ప్రయాణ బీమా

ఆరోగ్యం జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం లైఫ్-స్టైల్ వికారాబాద్ హైదరాబాద్

రూ. 35 పైసలతో రైలు ప్రయాణ బీమా
– 10 లక్షల రూపాయల వరకు పరిహారం
– వస్తువులు, లగేజీలకు కూడా కవరేజ్
దర్శిని డెస్క్‌: రైలు ప్రయాణాల్లో రూ. 35 పైసలకే ప్రమాద బీమా పొందొచ్చని తెలిసినా.. కొందరు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇటీవల జరిగిన బాలాసోర్‌ ఘోర రైలు ప్రమాదంలో వందలాది కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యాయి. వేలాది మంది హృదయాలు ఛిద్రం చేసింది. ఎన్నో కుటుంబాలు జీవనాధారం కోల్పోయాయి. ఈ సంఘటనతో రైలు ప్రయాణ బీమా అవశ్యకత అందరికి తెలిసి రావాలని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. అయితే బీమా సదుపాయాన్ని ఎలా పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

ట్రైన్ ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కోసం ఐఆర్‌సీటీసీ కేవలం 35 పైసలతో ప్రమాద బీమా సదుపాయాన్ని అందిస్తుంది. ఈ బీమా ద్వారా రూ. 10 లక్షల వరకు పరిహారంను అందిస్తోంది. అదేవిధంగా వస్తువులు, లగేజీని పోగొట్టుకున్నా ఈ బీమా ద్వారా పరిహారం లభిస్తుంది. ప్రయాణించే ముందు టిక్కెట్లు బుక్‌ చేసుకునే సమయంలోనే రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్‌ మనకు కనిపిస్తుంది. ఇక్కడి నుంచే బీమాను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

రైలు ప్రమాదానికి గురైన 4 నెలల్లోపు బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లి బీమా కోసం క్లెయిమ్‌ను దాఖలు చేయాలి. అయితే బీమాను ఎంచుకునే సమయంలో తప్పనిసరిగా నామినీ పేరును నమోదు చేయాల్సి ఉంటుంది.

మరోవైపు ప్రమాద బీమా పొందిన వారికి రైలు ప్రమాదం జరిగినప్పుడు మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యానికి గురైనా రూ. 10 లక్షల వరకు బీమా మొత్తం చెల్లిస్తారు. పాక్షికంగా అంగవైకల్యానికి గురైతే రూ.7.5 లక్షలు, తీవ్రంగా గాయపడితే రూ.2 లక్షలు, స్వల్ప గాయాలైతే రూ.10,000 వరకు అందజేస్తారు.

ఇది కూడా చదవండి…

త్వరలో నా పెళ్లి..!

chaithany collage