ఎమ్మెల్యే సహాకారంతో వార్డుల అభివృద్ధి
– రూ.30 లక్షలతో 28వ వార్డులో రోడ్డు పనులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సహాకారంతో మున్సిపల్ వార్డుల అభివృద్ధి జరుగుతోందని స్థానిక బీఆర్ఎస్ నేతలు అన్నారు. శుక్రవారం పట్టణంలోని 28వ వార్డులో స్థానిక కౌన్సిలర్ విజయదేవి ఆధ్వర్యంలో రోడ్డు పనులను ప్రారంబించారు. మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు హాజరై రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పట్టణ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే మంజూరు చేసిన రూ. 30 లక్షల ఎస్టీఎఫ్ నిధులతో రోడ్డు పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కౌన్సిలర్ విజయాదేవి మాట్లాడుతూ వార్డు అభివృద్ధికి నిధులు కేటాయించినందుకు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వి.రంగారావు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…


