గ్రూఫ్‌-4 పరీక్షకు సర్పంచ్..!

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

గ్రూఫ్‌-4 పరీక్షకు సర్పంచ్..!
– హాజరైన సంగెంకలాన్ సర్పంచ్ మేఘనాథ్‌ గౌడ్
– అభినందనలు తెలిపిన నేతలు
తాండూరు రూరల్, దర్శినిప్రతినిధి: ప్రజాసేవతో పాటు చదువుకు, ఉద్యోగ అవకాశాలకు ప్రాధాన్యమిచ్చే ప్రజాప్రతినిధులు అరుధుగా కనిపిస్తుంటారు. అటు పాలన, ప్రవృత్తి కోసం తాపత్రయ పడుతుంటారు. ఇందుకు తాండూరు నియోజకవర్గంలో ఓ సర్పంచ్ నిదర్శనంగా నిలుస్తున్నారు. శనివారం జరిగిన గ్రూప్-4 పరీక్షకు హజరై ఆశ్చర్య పరిచారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు మండలం సంగెంకలాన్ గ్రామ సర్పంచ్‌, మండల సర్పంచుల సంఘం అధ్యక్షులుగా సంగెం మేఘనాథ్ గౌడ్ కొనసాగుతున్నారు. వారి కుటుంబం ఎప్పటి నుంచో రాజకీయాల్లో రాణిస్తున్నారు. మేఘనాథ్ గౌడ్ నాయనమ్మ పార్వతమ్మ గౌడ్ తాండూరు ఎంపీపీగా పనిచేశారు. ప్రస్తుతం అతని చిన్నమ్మ అనిత రవీందర్ గౌడ్ ఎంపీపీగా కొనసాగుతున్నారు. తండ్రి నారాయణగౌడ్, కూడా పీఏసీస్ చైర్మన్‌గా పనిచేశారు.

తండ్రి తరువాత చిన్నాన్న అదే పీఏసీఎస్ చైర్మన్‌గా, డీసీసీబీ జిల్లా డైరెక్టర్‌గా ప్రస్తుతం రవీందర్‌ గౌడ్ కొనసాగుతున్నారు. అదేవిధంగా పెదనాన్న కుమారుడు మహేష్‌ గౌడ్‌ తహసీల్దార్‌ గా పనిచేస్తున్నారు. సొంత అన్న మణిగౌడ్‌ గ్రూప్‌-1 పరీక్ష రాశారు. అంతేకాకుండా వీరి కుటుంబం వ్యవసాయంతో పాటు పలు వ్యాపారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఓ వైపు ప్రజా ప్రతినిధిగా కొనసాగుతూనే ప్రభుత్వ ఉద్యోగవకాశాలలో భాగంగా అర్హత కలిగిన పరీక్షలకు హాజరుతున్నారు. తాజాగా శనివారం నిర్వహించిన గ్రూప్‌-4 పరీక్షకు సర్పంచ్ మేఘనాథ్ గౌడ్ హాజరయ్యారు. హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేసిన సెంటర్‌లో ఆయన పరీక్ష రాశారు. సర్పంచ్‌గా ఉండి పరీక్షకు హాజరుకావడంపై పలువురు ప్రజా ప్రతినిధులు మేఘనాథ్‌ గౌడ్‌కు అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage