వైభవంగా గురుపౌర్ణమి

తాండూరు రాజకీయం వికారాబాద్

వైభవంగా గురుపౌర్ణమి
– దర్శించుకున్న ప్రజా ప్రతినిధులు, భక్తులు
– అన్నదానం చేసిన శంకర్ యాదవ్ దంపతులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. సోమవారం గురుపౌర్ణమిని పురస్కరించుకుని కోకట్ రోడ్డు శివారులోని షిర్డీ సాయిబాబా దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయినాధునికి పూజలు, అభిషేకాలు, ఆర్చన, మంగళహారతి కార్యక్రమాలు కనుల పండగలా కొనసాగాయి. గురుపౌర్ణమి సందర్భంగా భక్తులు దేవాలయానికి భారీగా తరలిరావడంతో ఆలయం సందడిగా మారింది. బాబాను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఆలయంలో సాయిభక్తులు భక్తి పారవశ్యంతో భజన కీర్తనలు ఆలపించారు. అంతకుముందు శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్. చంద్రకళ దంపతులు సాయినాధునికి పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, మిత్రబృందం ఉన్నారు. మరోవైపు తాండూరుకు చెందిన ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు సాయినాథున్ని దర్శించుకున్నారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage