ఉర్సు ఉత్సవాలకు ముర్షద్ దర్గా ముస్తాము
– 20 నుంచి ఉర్సేషరీఫ్ ఉత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ముర్షద్ దర్గా ఉర్సు ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈనెల 20వ తేది నుంచి హజ్రత్ సయ్యద్ అబ్దుల్ కరీమ్ సాహెబ్ ఖిబ్లా చిప్తి ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి 75వ ఉర్సే షరీఫ్, హజ్రత్ సయ్యద్ అబ్దుల్ సలాం పాష సాహెబ్ ఖిబ్లా చిప్తి ఖలందరి మిర్జాయి రహమతుల్లా అలై గారి 15వ ఉర్సే షరీఫ్ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని ముతవల్లి అల్హాజ్ సయ్యద్ అబ్దుల్ గనిపాష శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉర్సు ఉత్సవాల సందర్భంగా 20వ తేదిన గంధము, రాత్రి 7 గంటలకు సమర్పిచండం జరుగుతుందని, 21వ తేదిన రాత్రి దీపోత్సవం, అనంతరం ఖవ్వాలి, 22వ తేదిన పాతేహాఖ్వాని, ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమాలలో భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

