రేపు తాండూరుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాక

తాండూరు రాజకీయం వికారాబాద్

రేపు తాండూరుకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ రాక
– పట్టణంలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర ఎక్సెజ్ వాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రేపు తాండూరుకు విచ్చేస్తున్నారు. సర్దార్ సర్వాయి పాప్పన్న గౌడ్ జయంతి సందర్భంగా తాండూరు పట్టణంలో విగ్రహావిష్కరణకు కమిటి సభ్యులు ఏర్పాట్లు చేశారు. గురువారం పట్టణంలోని వినాయక చౌరస్తా, శ్రీ సద్గురు పోట్లీ మహరాజ్ దేవస్థానం ఎదుట సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి గౌడ ప్రజా ప్రతినిధులు, సోదరులు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కమిటి సభ్యులు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!