‘రొంపల్లి’ సేవకు ఉత్తమ అవార్డులు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

‘రొంపల్లి’ సేవకు ఉత్తమ అవార్డులు..!
– తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ప్రధానం
– హర్యానా గవర్నర్ చేతుల మీదుగా అందజేత
– సంతోషం వ్యక్తం చేసిన సంతోష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరుకు చెందిన రొంపల్లి సంతోష్ కుమార్ సామాజిక సేవలకు ఉత్తమ అవార్డులు వరించాయి. రెండు ఉత్తమ అవార్డులను అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో మంజునాథ ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ వేడులకు హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీసీ కమీషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్థాయిలో సామాజిక సేవలను చేస్తున్న వారికి ప్రతిభా బంగారు నంది ఉత్తమ అవార్డులను అందజేశారు.

ఇందులో తాండూరుకు చెందిన యువనాయకులు, సామాజిక సేవకుడు రొంపల్లి సంతోష్ కుమార్ కు రాష్ట్ర స్థాయిలో రెండు ఉత్తమ అవార్డులను ప్రకటించారు. దీంతో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు చేతుల మీదుగా రొంపల్లి సంతోష్ కుమార్ అవార్డులను అందుకున్నారు. అనంతరం రొంపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఐవీఎఫ్, వాసవి క్లబ్, లయన్స్ క్లబ్, ఆర్యవైశ్య యువజన సంఘాల ద్వారా తనవంతు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. సేవా కార్యక్రమాల్లోనే ఆత్మసంతృప్తి లభిస్తుందని అన్నారు. తనకు తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డులు రావడం మరింత ఉత్సహాన్ని అందించిందన్నారు. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడమే ధ్యేయమన్నారు.

ఇది కూడ చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!