అంగన్వాడీ టీచర్ల సేవలు అభినందనీయం
– ఎన్ఎస్పీ ట్రస్టు ఆధ్వర్యంలో సన్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : చిన్నారుల సంక్షేమంతో పాటు విద్యాభివృద్ధికి కృసి చేసే అంగన్ వాడీ టీచర్ల సేవలు అభినందనీయమని తాండూరు నూలి శుభప్రద్ పటేల్(ఎన్ఎస్పీ) ట్రస్టు సభ్యులు అన్నారు. మంగళవారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ట్రస్టు ఆధ్వర్యంలో పట్టణంలోని కార్యాలయంలో అంగన్ వాడీ టీచర్లకు సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్టు నిర్వహకులు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులకు తొలిబడిగా అంగన్ వాడీ కేంద్రం నిలుస్తుందన్నారు. ఈ కేంద్రంలో చిన్నారుల సంక్షేమంతో పాటు విద్యకు శ్రీకారం చుట్టడం జరుగుతుందని అన్నారు. అలాంటి అంగన్ వాడీ కేంద్రాల్లో ఉపాధ్యాయుల పాత్ర పోషిస్తున్న అంగన్ వాడీ టీచర్లను సన్మానించడం సంతోషంగా ఉందన్నారు. అంగన్ వాడీ టీచర్ల సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు నిర్వహకులు శ్రీశైలం, మాజీ సర్పంచ్ లక్కాకుల నిర్మల, శుభప్రద్ పటేల్ యువసేన సభ్యులు భాను, బాలు, నరేష్ గౌడ్, విజయ్ కుమార్, అల్లాపూర్ నరేష్ గౌడ్, మనోహర్, సాయికుమార్, చావుస్, హరీష్, అంగన్ వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

