‘ముచ్చట’యిన రాజకీయం..!
– నారాయణరావును కలిసిన కేఎల్‌ఆర్
– చర్చనీయాంశమైన ఇద్దరు మాజీ ఎమ్మెల్యేల కలయిక
తాండూరు, దర్శిని ప్రతినిధి : వారిద్దరు మాజీ ఎమ్మెల్యేలు. ఒకరు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇంకొకరు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారిద్దరి కలయిక చూడముచ్చటయ్యింది. ప్రస్తుతం తాండూరు నియోజకవర్గంలో కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి(కేఎల్ఆర్), మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణ రావు(ఎంఎస్ఆర్)ల పరిచయం అక్కర్లేని పోలిటికల్ లీడర్లు.
కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పిన నేతలు. కొన్ని కారణాల వల్ల ఎం.నారాయణ రావు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేఎల్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. అయితే గురువారం కేఎస్ఆర్, ఎంఎస్ఆర్ భేటి చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్ మాజీ ఎమ్మెల్యే నారాయణ రావును కలుసుకున్నారు. ఈ ఇద్దరి భేటి తాండూరు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. నారాయణ రావును కలిసి కేఎస్ఆర్ ప్రస్తుత ఎన్నికల గురించి చర్చించినట్లు తెలుస్తోంది. ఈసారి తాండూరులో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు సహకరించాలని కేఎల్‌ఆర్ కోరినట్లు ప్రచారం జరిగింది.

ఇది కూడా చదవండి..

