పైలెట్ మద్దతులో వెనక్కి తగ్గేదిలేదు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్ మద్దతులో వెనక్కి తగ్గేదిలేదు..!
– బీసీ కండువాలు వేసుకునే ప్రచారం చేస్తాం
– బీసీల ముసుగుతో ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు
– మీడియా సమావేశంలో బీసీ సంఘం నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎన్నికల్లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి మద్దతు విషయంలో వెనక్కి తగ్గేది లేదని, ఖచ్చితంగా ప్రచారం చేస్తామని బీసీ సంఘం నాయకులు అన్నారు. బీసీ సంఘం మద్దతుతో పాటు తాండూరు కన్వినర్ రాజ్ కుమార్ పై చేసిన వాఖ్యలను గురువారం ఖండించారు. బీసీల ముసుగులో కాంగ్రెస్, బీజేపీ నేతలు చేసిన సూటి పోటీ మాటలతో బీసీల ఐక్యతను దెబ్బతీయలేరన్నారు. బీసీ సమస్యలపై మాట్లాడని నేతలు పూటకో పార్టీ మార్చి అర్హతను కోల్పోయారని అన్నారు. అదేవిధంగా బీసీల. సమస్యలపై పోరాడే ఏకైక వ్యక్తిగా గుర్తింపు ఉన్న రాజ్ కుమార్ పై ఈగ వాలనివ్వమన్నారు.

బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ఆదేశాల మేరకు ఎన్నికల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి మద్దతు ఇస్తామన్నారు. బీసీ కండువాలు కప్పుకునే ప్రచారం చేస్తామన్నారు. తాండూరు రాజకీయాల్లో బీసీల సునామీలో కాంగ్రెస్ కొట్టుకోవడం భాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం మహిళ అధ్యక్షురాలు నాయికోడి జ్యోతి, ఉపాధ్యక్షురాలు అనిత, కార్యదర్శి విజయలక్ష్మి, సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్, యువ నాయకులు రాము మదిరాజ్, ట్రైలర్ రమేష్. నర్సింగ్, మల్లేష్, నరేష్ యాదవ్, రాజు, ఆనంద్, నగేష్ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..