బీఆర్ఎస్ పార్టీకి దిమ్మదిరిగే షాక్..!

తాండూరు రాజకీయం వికారాబాద్

బీఆర్ఎస్ పార్టీకి దిమ్మదిరిగే షాక్..!
– హస్తం గూటికి తాండూరు. బషీరాబాద్ ఎంపీపీలు
– కాంగ్రెస్‌లోకి ఎల్మకన్నె, యాలాల పీఏసీఎస్ చైర్మన్లు
– అదేబాటలో కౌన్సిలర్లు, డైరెక్టర్లు, నేతలు
– ఆహ్వానించిన డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీకి దిమ్మదిరిగే షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఎంపీపీలు, పీఏఎసీఎస్ చైర్మన్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, డైరెక్టర్లు హస్తం గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ చేరికలు జరిగాయి. శుక్రవారం తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీసీసీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి హాజరయ్యారు.

ఆయన సమక్షంలో తాండూరు ఎంపీపీ సంగెం అనితా రవీందర్ గౌడ్, బషీరాబాద్ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్, జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, డీసీసీబీ జిల్లా డైరెక్టర్, తాండూరు మండలం ఎల్మకన్నె. పీఏసీఎస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్, యాలాల పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి. బషీరాబాద్ పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, ఏడు మంది డైరెక్టర్లు, బషీరాబాద్ మండలం కొర్విచెడ్ సర్పంచ్ శోభారాణి, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్లు ప్రవీణ్ గౌడ్, భీంసింగ్ రాథోడ్, మాజీ కౌన్సిలర్లతో పాటు దాదాపు 100 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మాజీ జెడ్పీటీసీ రాకేష్ మహరాజ్, కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

 మోసపోవద్దు గొసపడతాం..