కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే గోసపడతాం
– పథకాల బంద్ తో మళ్లీ వెనుకబాటు
– బీఆర్ఎస్ పార్టీతోనే అన్ని వర్గాల అభివృద్ధి
– ఎన్నికల్లో హస్తం పార్టీని తరిమి కొట్టండి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మళ్లీ గోసపడతామని, కారు గుర్తుకు ఓటేసి సంక్షేమాన్ని కాపాడుకుందామని తాండూరు ఎమ్మెల్యే సైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మండలం గౌతాపూర్ గ్రామంలో ప్రజా ఆశీర్వాద యాత్ర చేపట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కారు ప్రతి ఆడబిడ్డను సొంత బిడ్డలాగ చూసుకుందన్నారు. ఫించన్లు అందిస్తూ వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలను ఆదుకుంటుందన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందిస్తుందన్నారు.
రైతు చనిపోతే కుటుంబం రోడ్డు పాలు కావొద్దని రూ. 5 లక్షల రైతు బీమా అందించి ఆదుకుంటున్న ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ సహాకారంతో తాండూరు బిడ్డగా నియోజకవర్గాన్ని అభివృద్ధికి కృషి చేయడం జరిగిందన్నారు. గతంలో ఎవ్వరి చేయని విధంగా సాధించిన రూ. 1680 కోట్లలో ప్రతి గ్రామానికి నిధులు ఇవ్వడం జరిగిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు అడగకపోయిన ప్రగతిని చేసి చూపించామన్నారు. అలాంటి పార్టీ కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆగమవుతామన్నారు. మన పథకాలన్నీ కట్ అవుతాయన్నారు. దీంతో మళ్లీ పదేండ్ల వెనుకుబాటుకు గురవుతామన్నారు. ఎన్నికల్లో హస్తం పార్టీని తరిమి కొట్టాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మూడో సారి, ఎమ్మెల్యేగా తనకు రెండో సారి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
అంతకుముందు ఎమ్మెల్యే గ్రామంలో చేసిన ప్రచారానికి నేతలు, కార్యకర్తలతో పాటు జనాలు బ్రహ్మరథం పట్టారు. భారీ ర్యాలీతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ బైండ్ల విజయ్ కుమార్. తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, సర్పంచ్ రాజప్ప గౌడ్, ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

