మైనార్టీ విద్యార్థులకు గుడ్ న్యూస్..!
– కేఏయూ నుంచి పూర్తి నిధుల స్కాలర్ షిఫ్
– మాస్టర్స్, ఫీహెచ్‌డీ అభ్యర్థులకు ఉపయోగం
– ఎక్కడ, ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?
వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని మైనార్టీ విద్యార్థులకు సంక్షేమ శాఖ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. సౌది అరేబియాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ విశ్వ విద్యాలయం(కేఏయూ) నుంచి విద్యార్థులకు పూర్తి నిధుల స్కాలర్‌షిప్ అందిస్తుందని జిల్లా అధికారిణి సుధారాణి ఓ ప్రకటినలో తెలిపారు. 2023-2024 విధ్య సంవత్సరానికి గాను మైనారిటీ విద్యార్థుల నుంచి ధరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని తెలిపారు. మాస్టర్, పీహెచ్‌డీలతో పాటు డిగ్రీ ప్రోగ్రాం కోర్సులు కొనసాగించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ఇతర పూర్తి వివరాలకు (:https://graduatestudies.kau.edu.sa/Content-306-EN-278671)లో పొందుపరచడం జరిగిందని తెలియజేశారు. ఈ నెల 28 వరకు ఆన్ లైన్ లో ధరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఎవరికి స్కాలర్‌షిఫ్ అందిస్తారో కింద తెలుసుకోండి.
PhD అభ్యర్థులకు
ఆర్ట్స్ & హ్యుమానిటీస్ ఫ్యాకల్టీ
సామాన్య శాస్త్ర విభాగము
ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ
వాతావరణ శాస్త్ర ఫ్యాకల్టీ
పర్యావరణం శుష్క భూమి వ్యవసాయం
మెరైన్ సైన్స్ ఫ్యాకల్టీ
ఫ్యాకల్టీ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్
కంప్యూటింగ్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్యాకల్టీ
మాస్టర్స్ అభ్యర్థుల కోసం
ఆర్ట్స్ & హ్యుమానిటీస్ ఫ్యాకల్టీ
ఎకనామిక్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ
సామాన్య శాస్త్ర విభాగము
ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ
వాతావరణ శాస్త్ర ఫ్యాకల్టీ
పర్యావరణం శుష్క భూమి వ్యవసాయం
మెరైన్ సైన్స్ ఫ్యాకల్టీ
ఫ్యాకల్టీ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ డిజైన్
కంప్యూటింగ్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫ్యాకల్టీ
ఇది కూడా చదవండి…

