రేషన్ ఈకేవైసీకి డెడ్ లైన్..!

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రేషన్ ఈకేవైసీకి డెడ్ లైన్..!
– గడువు పొడగిస్తూ ఉత్తర్వులు
– ఎప్పటికి వరకు చేసుకోవచ్చంటే..?
దర్శిని డెస్క్‌: రేషన్ కార్డుల వెరిఫికేషన్ కోసం ప్రారంభించిన ఈకేవైసీపై ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. డిసెంబర్ 31 వరకు ఉన్న గడువును పొడగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. రేషన్‌ సరకులు పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో, కేవలం కార్డులో పేర్లు ఉన్న లబ్ధిదారులకే బియ్యం అందాలని తెలంగాణలో ఈకేవైసీని ప్రభుత్వం చేపట్టింది. రేషన్ డీలర్ల వద్ద ఉన్న ‘ఈ పాస్‌ యంత్ర’ ద్వారా ప్రతీ లబ్ధిదారుడు కేవైసీ చేసుకోవాలని సూచించింది. ఆధార్‌ ధ్రువీకరణ, వేలిముద్రలు, ఐ రిష్‌ వంటి గుర్తింపును తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శనివారం నాటికి ఈ ప్రక్రియ 70.80% పూర్తయింది.

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా 87.81% నమోదుతో ప్రథమ స్థానంలో ఉంది. అతి తక్కువగా వనపర్తి జిల్లాలో 54.17% పూర్తయింది. దీంతో ఈ-కేవైసీకి డెడ్‌లైన్‌ విధిస్తూ అధికారులు ఉత్వర్వులు జారీ చేశారు. రేషన్‌కార్డు లబ్ధిదారులు జనవరి 31వ తేదీలోగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహాన్‌ తెలిపారు.

ఎలా చేసుకోవాలంటే..
రేషన్‌ కార్డు కేవైసీ చేసుకోవడానికి రేషన్‌కార్డు ఉన్న కుటుంబ యజమానితోపాటు ఆ కార్డులో పేర్లు ఉన్న కుటుంబ సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణానికి వెళ్లి ‘ఈ పాస్’ మిషన్‌లో మళ్లీ వేలిముద్రలు వేయాలి. వేలిముద్ర తీసిన తర్వాత అతని ఆధార్ కార్డు నంబర్‌తో పాటు రేషన్ కార్డు నంబర్ డిస్‌ప్లే అవుతుంది. ఆ తర్వాత గ్రీన్ లైట్ వచ్చి KYC అప్ డేట్ పూర్తవుతుంది. రెడ్ లైట్ ఆన్‌లో ఉంటే, వినియోగదారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు సరిపోలడం లేదని అర్థం. దీంతో రేషన్‌ కార్డ్‌ నుంచి ఒక యూనిట్‌ను తొలగిస్తారు. రేషన్ కార్డులో ఎంత మంది పేర్లు ఉన్నాయో, వారంతా ఒకే సమయంలో కేవైసీ కోసం రేషన్ దుకాణానికి వెళ్లాలి.

ఇది కూడా చదవండి…

ప్రజారంజక పాలనే ధ్యేయం