రమ్యోత్సవంలా…!
– ఇంటింటా శ్రీరాముని సంబరాలు
– ‘కోట్రిక’ నివాసంలో వైభవంగా వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రమ్యమైన రామ నామ స్మరణతో శ్రీరాముని ఉత్సవాలను తాండూరులో రమ్యోత్సవంలా జరుపుకున్నారు. అయోధ్యలో భన్య రామ విగ్రహ ప్రతిష్టాతపను పురస్కించుకుని తాండూరులో ఇంటింటా శ్రీరామ ఉత్సవాలను ప్రారంభించారు. బుధవారం తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య నివాసంలో ఈ ఉత్సవాలను వైభవంగా జరుపుకున్నారు. ఉత్సవాలలో భాగంగా నివాసంలో భారీ శ్రీరాముని ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో శ్రీరాముని నామంతో ఉన్న బొమ్మల రామాణాన్ని ప్రదర్శించారు. అఖండ భారతదేశ ప్రతిమలో సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య రామమందిరం ముగ్గును వేశారు. చిత్రపటం చుట్టూ దీపాలను అలంకరించి వెలగించారు.
అంతేకాకుండా సతీసమేతమైన సీతారాముల రంగవల్లిని తీర్చిదిద్దారు. మహిళ భక్తులు తరలివచ్చి శ్రీరామున్ని కీర్తిస్తూ భజన కీర్తలను అలపించారు. జైశ్రీరాం… జైశ్రీరాం నినాదాలతో మార్మోగించారు.

ఈ సందర్భంగా మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ మాట్లాడుతూ హిందూ ధర్మానికి శ్రీరాముడు ఆదర్శనీయుడుని అన్నారు. దాదాపు 500 ఏండ్ల తరువాత అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన చేయపట్టడం గర్వకారణమన్నారు. తాండూరులో ఈనెల 22న నిర్వహించే శ్రీరాముని ఉత్సవాలను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె కోడలు నాగలక్ష్మి, ఆర్యవైశ్య మహిళ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, మహిళ భక్తులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి…

