ఎమ్మెల్సీ పరామర్శ..!
– రాంలింగారెడ్డి ఇంటికి వెళ్లిన మహేందర్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ పట్లోళ్ల రాంలింగారెడ్డి, జినుగుర్తి గ్రామ సర్పంచ్ పట్లోళ్ల రత్నమ్మ కుటుంబాన్ని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పరామర్శించారు. రాంలింగారెడ్డి తండ్రి జినుగుర్తి గ్రామ మాజీ సర్పంచ్ పట్లోళ్ల యేసిరెడ్డి అనారోగ్యంతో సోమవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. బుధవారం ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జినుగుర్తి గ్రామానికి వెళ్లారు. రాంలింగారెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. గ్రామానికి స్వర్గీయ యేసిరెడ్డి చేసిన సేవలు గుర్తిండి పోతాయన్నారు.
కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కలిగి ఉండాలన్నారు. ఎమ్మెల్సీ వెంట బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, తాండూరు సూర్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, నాయకులు బీదర్ రాజశేఖర్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

