ఆధార్ వినియోగారులకు ఇబ్బందులు కలగొద్దు
– తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
– ఆధార్ కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు అవసరమైన విధంగా ఆధార్ సేవలు అందించేలా దృష్టి సారించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బుధవారం తాండూరు పాత మున్సిపల్ కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన మూడు ఆధార్ కేంద్రాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సందర్శించారు. నిర్వహకులు వినియోగదారులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారని ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆధార్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. కేంద్రాలకు వచ్చిన వినియోగదారులకు మర్యాదపూర్వకంగా వ్యవహరించి సేవలందించాలన్నారు.
ఈ కేంద్రాలలో రద్దీ ఎక్కువైతే అవసరమైతే ఇతర మండల కేంద్రాల్లో కూడా ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ మధుబాల, కౌన్సిలర్లు ప్రభాకర్ గౌడ్, మమత, నాయకులు సర్దార్ ఖాన్, వడ్డె శ్రీనివాస్, సాయిపూర్ బాల్ రెడ్డి, బాతుల వెంకటయ్య తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

