మిరాకిల్ గ్యాస్పల్ సేవలు అభినందనీయం

తాండూరు రాజకీయం వికారాబాద్

మిరాకిల్ గ్యాస్పల్ సేవలు అభినందనీయం
– పేదలకు సేవాగుణం యేసు మార్గం
– చర్చి సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో సునీతారెడ్డి వెల్లడి
యాలాల, దర్శిని ప్రతినిధి : మిరాకిల్ గ్యాస్పల్ చర్చి గత 25 ఏళ్లుగా చేస్తున్న సేవలను జడ్పి చైర్ పర్సన్ పట్నం సునీతారెడ్డి అభినందించారు. శుక్రవారం యాలాల మండలం ఖంజాపూర్ శివారులో గల మిరాకిల్ గ్యాస్పల్ చర్చి సిల్వర్ జూబ్లీ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పేదలకు సేవచేయడమే యేసు మార్గమని సునీతారెడ్డి సూచించారు. తాండూరు నియోజకవర్గంలోని 22 గ్రామాల్లో పేద ప్రజలకు మెడికల్ క్యాంపులు నిర్వహించడం, గర్భిణీలకు ఉచితంగా రక్త పరీక్షలు చేయడం, ప్రొటీన్ పౌడర్, క్యాల్షియం టాబ్లెట్స్ పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు.

ఎవరైనా పేద వాళ్ళు ఉంటే చేవెళ్ల లోని మహేంధర్ రెడ్డి మెడికల్ కళాశాలలో ఉచిత వైద్య సేవలు అందిస్తామని హామీ ఇచ్చారు. మతాలు ఏవైనా ప్రజాలి దైవభక్తి కలిగి ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా చర్చి ఫాస్టర్ రెవరెండ్ స్టీవెన్సన్ సతీష్ గారు, రెవరెండ్ జాస్వా గుమ్మల్లా, ప్రవక్తలు మైక్, దైవజనుడు ఎరిక్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమాల్, డీసీసీబీ డైరెక్టర్ రవి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వడ్డే శ్రీనివాస్, అరుణ్, బల్వంత్ రెడ్డి, కొనపూర్ రాజు, సంఘం నాయకులు రాజరత్నం, నర్సిములు, వెంకటయ్య, నాయకులు ప్రకాశం, బిచ్చప్ప, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

సార్లు వస్తున్నారు..!